Keelu Gurramekkaade
Kindha Meedha Paddade
Raakumari Kaavalannade
Oobiloki Dhookade
Ootha Gatra Lenode
Oorinalla Yelalannaade
Gaaligaadi Theere Maarii
Gaadioki Vacchaade
Yaavameedha Yaaparaanne Pettade
Aaru Nooru Ayyedhaka
Aavalinchanannaade
Aagaleka Saagelage Unnade
Hey Swari Cheyra Kaalam Meedha
Seeku Sinthalunnode
Sunna Kanna Sinnode
Sinna Soopu Soododhannaade
Jeevithanni Pillode
Pattalekkinchesade
Mailu Raayi Dhatinchesaade
Noti Neeru Oore Oore
Vanta Eedu Setthaade
Thinnavaadu Aahalokam Soothade
Notu Meedha Gandhi Thathe
Navvukuntu Vachaade
Navvukunta Gallapetti Seraade
Hey Adde Neeku Ledhiyyaala
Neekai Veeche Pillagali Eevela
Swaasalle Cherindha Edhalo..
Ninna Monna Unna Bhadha Eevela
Haayalle Maarindha Madhilo..
Sadilenii Jadivaana
Saradhaaga Kurisindha
Manasaaraa Thadilona
Podipranam Thadisinda
Gundello Unde Prema
Kallallo Cherindhamma
Choopullo Unde Prema Dhaagena..
Dhachalanna Kudaradhu Suma
Asalokamaataina Evaritho Anakunda
Aligelli Poindhi Dhooramendhuko
Anthuleni Santhosham Ganthulese
Ee Nimisham
Iddhokkatayyero Ipude Ipude
Ye Bhadhabandi Ledhiyyala
Undhi Nedu Bagane Ninna Monna Lagane
Repu Kooda Untanantava
Gaddu Rojulosthene Kashtam Suttam Aithene
Maarpu Neelo Vasthadhantava
Innibaadhalochayantu Boruborumantava
Oddhu Oddhu Ante Nuvve Intaava
Odaleni Reve Neevai Bosipoyi Untava
Odiponi Vare Leroi Choosthava
Hey Sayam Chese Kalam Raadha
Telugu Version
కీలు గుర్రమెక్కాడే
కింద మీద పడ్డాడే
రాకుమారి కావాలన్నాడే
ఊబిలోకి దూకాడే
ఊత గట్ర లేనోడే
ఊరినల్ల ఏలాలన్నాడే
గాలిగాడు తీరే మారీ
గాడిలోకి వచ్చాడే
యావమీద యాపారాన్నే పెట్టాడే
ఆరు నూరు అయ్యేదాకా
ఆవలించనన్నాడే
ఆగలేక సాగేలాగే ఉన్నాడే
హే స్వారీ చైర కాలం మీదా
సీకు సింతలున్నోడే
సున్నా కన్నా సిన్నోడే
సిన్న సూపు సూడొద్దన్నాడే
జీవితాన్ని పిల్లోడే
పట్టాలెక్కించేసాడే
మైలు రాయి దాటించేసాడే
నోటి నీరు ఊరే ఊరే
వంట ఈడు సేత్తాదే
తిన్నవాడు ఆహాలోకం సూత్తాడే
నోటు మీద గాంధీ తాతే
నవ్వుకుంటు వచ్చాడే
నవ్వుకుంట గల్లాపెట్టి శేరాడే
హే అడ్డే నీకు లేదియ్యాలా
నీకై వీచే పిల్లగాలి ఈవేళ
శ్వాసల్లే చేరిందా ఎదలో
నిన్నా మొన్నా ఉన్న భాధ ఈవేళ
హాయల్లే మారిందా మదిలో
సడిలేనీ జడివానా
సరదాగా కురిసిందా
మనసారా తడిలోనా
పొడిప్రాణం తడిసిందా
గుండెల్లో ఉండే ప్రేమ
కళ్ళల్లో చేరిందమ్మా
చూపుల్లో ఉండే ప్రేమ దాగేనా
దాచాలన్న కుదరదు సుమా
అసలోకమాటైనా ఎవరితో అనకుండా
అలిగెల్లి పోయింది దూరమెందుకో
అంతులేని సంతోషం గంతులేసే
ఈ నిమిషం
యుద్ధోక్కటయ్యేరో ఇపుడే ఇపుడే
ఏ భాధబండి లేదియ్యాలా
ఉంది నేడు బాగానే నిన్న మొన్న లాగానే
రేపు కూడా ఉంటానంటావా
గడ్డు రోజులొస్తేనే కష్టం సుట్టం ఐతేనే
మార్పు నీలో వస్తాదంటావా
ఇన్ని బాధలొచ్చాయంటూ భోరుభోరుమంటావా
ఒద్దు ఒద్దు అంటే నువ్వే ఇంటావా
ఓడలేని రేవే నీవై బోసిపోయి ఉంటావా
ఓడిపోని వారే లేరోయ్ సూస్తావా
హే సాయం చేసే కాలం రాదా
Views: 244
No comments yet